నా తండ్రి అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం : కార్తి

by సూర్య | Wed, Aug 21, 2019, 11:35 PM

తన తండ్రి చిదంబరం   ఏ రోజు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదని,  అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని కార్తి చిదంబరం బుధవారం ఆరోపించారు. 2008లో జరిగిన దానికి 2017లో కేసు నమోదు చేశారని, సమన్లు అందిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హడావుడి సృష్టించారని , దర్యాఫ్తు సంస్థల తీరును ఆయన తప్పుబట్టారు.


ఇదంతా బీజేపీ తప్ప ఎవరు చేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కార్తి చిదంబరం ఎదురు ప్రశ్న వేశారు. ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసిందని, ఆయన కూడా హాజరయ్యారని, మేం కోర్టుకు వెళ్తామని, క్లీన్‌గా తిరిగి వస్తామని చెప్పారు.


 


 

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM