రాజధానిపై తెరపైకి వస్తున్న కొత్త డిమాండ్లు

by సూర్య | Wed, Aug 21, 2019, 05:11 PM

ఏపీ రాజధాని మార్పు అంశం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చేస్తుందని వార్తలు వస్తున్నాయి. రాజధానిగా అమరావతి ప్రాంతం సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కేపిటల్ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని రాజధాని చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. రాజధానిపై కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
రాజధాని రేసులోకి తిరుపతి వచ్చింది. ఏపీ రాజధానిగా తిరుపతి చేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. రాజధానిగా దొనకొండ కంటే తిరుపతి బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దొనకొండలో రాజధాని ఏర్పాటుకి వసతులు లేవన్నారు. అందుకే తిరుపతి బెస్ట్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందే ప్లేస్ తిరుపతి మాత్రమే అని చెప్పారు. రాజధానిగా దొనకొండ ఆలోచనను సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అంశం సున్నితమైందని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చింతామోహన్ సూచించారు.


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM