రూ.10 వేలకు వీఐపీ దర్శనం

by సూర్య | Wed, Aug 21, 2019, 04:57 PM

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దళారుల ప్రమేయం లేకుండా నివారించాలని ఓ కార్యక్రమం మొదలు పెట్టనుంది. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన టీటీడీ 10 వేలు విరాళం వచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్‌ దర్శన సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంతో టీటీడీ అధికాకంగా ఆదాయం వస్తుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ, రూ.10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్‌ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళలు ఇస్తే ముఖ్యమైన వస్త్రలంకార, తోమల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు. దీంతో రోజుకు కనీసం కోటీ రూపాయల చొప్పున ఏడాదిలో రూ.360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచాన వేస్తున్నారు. త్వరలో టీటీడీ పాలకమండలి ఏర్పాడి, ఈ విధానానికి ఆమోదం వేస్తుందని, ఆపై సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలుస్తోంది. 




 

Latest News

 
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM
ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్ Mon, Apr 29, 2024, 07:57 PM
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM