మంత్రి’ అనే పదానికి బదులు ‘ముఖ్యమంత్రి’ అనే ...

by సూర్య | Tue, Aug 20, 2019, 10:06 PM

అనేక నాటకీయ పరిమాణాల అనంతరం కర్ణాటకలో కొలువుదీరిన యడియూరప్ప ప్రభుత్వం ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. యడ్డీ తన కేబినెట్‌లో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. అయితే మంగళవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఓ నేత మంత్రికి బదులుగా ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకారం సందర్భంగా నోరు జారారు. మధు స్వామి ‘మంత్రి’ అనే పదానికి బదులు ‘ముఖ్యమంత్రి’ అనేశారు. దాంతో ఒక్కనిమిషం పాటు అందరు ఆశ్చర్యపోయారు.  అయితే అక్కడే ఉన్న యడియూరప్ప నవ్వుతూ, మధు స్వామిని ఆలింగనం చేసుకున్నారు. 


కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమిని గద్దె దింపి అధికారం చేపట్టిన భాజపా మూడు వారాల పాటు కేవలం ముఖ్యమంత్రి యడియూరప్పతోనే ప్రభుత్వాన్ని నడిపించింది. భాజపా విధానమైన ‘మినిమం గవర్నమెంటు’కు ఇది నిదర్శనమని  విపక్షాలు ఎద్దేవా చేశాయి. అయితే  చివరకు నేడు మంత్రివర్గాన్ని విస్తరించారు. 

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 02:08 PM
దుంపలగట్టు ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 02:06 PM
బత్యాల సమక్షంలో వైకాపాను వీడి టిడిపిలో చేరిన 100 కుటుంబాలు Fri, May 03, 2024, 02:05 PM