చిదంబరంపై లుకౌట్ నోటీసులు జారీ

by సూర్య | Wed, Aug 21, 2019, 01:22 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో  కేంద్ర మాజీ మంత్రికి సీబీఐ, ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరంకు నిరాశే ఎదురైంది. ఈ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మరోవైపు చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని దిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Latest News

 
లోకేష్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నాడు Sat, Apr 20, 2024, 12:47 PM
తప్పుడు ప్రచారాలు ఆపండయ్య Sat, Apr 20, 2024, 12:47 PM
టీడీపీ సోషల్ మీడియాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు Sat, Apr 20, 2024, 12:46 PM
రాజకీయాలు ప్రజాస్వామ్యపధ్దతిలో చెయ్యాలి Sat, Apr 20, 2024, 12:45 PM
చీపురుపల్లి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు Sat, Apr 20, 2024, 12:45 PM