ఆధార్ లింక్‌పై సుప్రీంకోర్టులో విచారణ

by సూర్య | Tue, Aug 20, 2019, 03:49 PM

సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ అనుసంధానంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. మద్రాస్ హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఫేస్‌బుక్ పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్‌తో పాటు మరికొన్ని రాష్ర్టాల్లో ఉన్న పిటిషన్లను బదిలీ చేసి సుప్రీంకోర్టు పరిధిలోకి తేవాలని ఫేస్‌బుక్ కోరింది. పిటిషన్లు బదిలీ చేయాలన్న ఫేస్‌బుక్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి చేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్ అనుసంధానిస్తే తప్పుడు ఖాతాలు గుర్తింపు సులభమవుతుందని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వ్యతిరేకిస్తున్నాయి.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM