గ్రామవాలంటీర్లు తప్పుచేస్తే తొలగిస్తాం : బొత్స

by సూర్య | Tue, Aug 20, 2019, 02:49 PM

గ్రామ వాలంటీర్లు జాగ్రత్తగా పని చేయాలని… తప్పులు చేసిన వారిని విధుల నుంచి తొలగిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కొత్తగా నియమితులైన గ్రామ వాలంటీర్లను ఉద్దేశిస్తూ మంత్రి బొత్స కీలక సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని… ప్రజా సేవకులని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని అన్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రతి గ్రామ వాలంటీర్ 50 కుటుంబాల చొప్పున బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని… బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Latest News

 
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్‌ Sat, Apr 20, 2024, 12:44 PM
పిఠాపురం నుండి వైసీపీలోకి భారీగా వలసలు Sat, Apr 20, 2024, 12:43 PM
రాజానగరం అసెంబ్లీ స్థానానికి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:43 PM
అట్టహాసంగా రోజా నామినేషన్ Sat, Apr 20, 2024, 12:42 PM
కడప వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా వైయ‌స్‌ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:42 PM