శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 21న అంకురార్ప‌ణ‌

by సూర్య | Mon, Jun 24, 2019, 05:34 PM

టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలోని  శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 11వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.


శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు : జూలై 12న ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 13న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 14న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 15న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.


జూలై 16న ఉదయం పల్లకీ సేవ అనంతరం చంద్రగ్రహణం కారణంగా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. జూలై 17న సాయంత్రం 5 నుండి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.00 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 18న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 19న రాత్రి 7.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 20న ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, ఉదయం 10.30 గంటలకు త్రిశూలస్నానం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM