త్వ‌ర‌లో ఫీజుల నియంత్రణకు చట్టం: సీఎం జగన్‌

by సూర్య | Mon, Jun 24, 2019, 05:37 PM

కేంద్రం ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో విద్య అనేది సేవ కానీ.. డబ్బు ఆర్జించే రంగం కాదని చెప్పారు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదని జగన్‌ దిశానిర్దేశం చేశారు. జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు ఉండడంతో పాటు కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని అన్నారు సీఎం జగన్.


 రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉందని.. జాతీయ స్థాయి సగటు కన్నా ఇది ఎక్కువని.. అందుకే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్‌ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM