సీడీపీవోను సస్పెండ్ చేయాలని అంగన్వాడీ వర్కర్ల ఆందోళన

by సూర్య | Mon, Jun 24, 2019, 02:46 PM

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు కదంతొక్కారు. ఐసీడీఎస్ రూరల్ ప్రాజెక్ట్ సిడిపిఓ మాధవి లత ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అంగన్వాడీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో రూరల్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడి సిబ్బందిని కులం పేరుతో దూషించడం, వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటి సంఘటనపై ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ప్రత్యక్ష చర్యకు దిగామని నేతలు పేర్కొన్నారు. సిడిపిఓ మాధవ లత ను సస్పెండ్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. వందలాది మంది అంగన్వాడీ కార్మికులు అరుణ పతాకాలను చేత పట్టి రూరల్ సి డి పి ఓ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM