అదుపు చేయలేని యుద్ధాన్ని చూస్తారు: ఇరాన్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:06 PM

ఇరాన్‌తో పెట్టుకుంటే ఇస్లామిక్ రీజియన్‌లో ఎవరూ అదుపుచేయలేని పరిణామాలను చూస్తారని, ఇక్కడ అడుగుపెట్టే అమెరికా బలగాల ప్రాణాలకు ముప్పు తప్పదని ఇరాన్ మేజర్ జనరల్ రషీద్ హెచ్చరించారు. ఆదివారం టెహ్రాన్‌లో మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సైనికాధికారులతో మాట్లాడారు. ఒక వేళ యుద్ధం మొదలైతే ఎవరూ ఊహించని, అదుపు చేయలేని స్థితికి చేరుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఇరాన్ పార్లమెంట్ సమావేశంలో పలువురు సభ్యులు అమెరికాను అంతం చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఇరాన్ గగనతలంలోకి గురువారం అమెరికా డ్రోన్ అక్రమంగా చొచ్చుకొని రావడాన్ని పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM