ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి: సీఎం జగన్‌

by సూర్య | Mon, Jun 24, 2019, 11:46 AM

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పని చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉండవల్లి ప్రజాదర్బార్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్‌ కలెక్టర్లు, ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు మనం సేవలకులన్న విషయం ప్రతిక్షణం గుర్తుం డాలన్నారు. నవరత్నాలు మన మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియని పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. మన ప్రభుత్వం అంటే అధికారులు కూడా ఉంటారు… అందరం కలిసికట్టుగా పని చేస్తేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయగలమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే మేనిఫెస్టో చూపించి ఇవన్నీ పూర్తి చేశామని చెప్పగలగాలన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి ఎక్కడా ఉండకూడదన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిజాయితీతో పని చేయాలన్నారు. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలు అని, ఆ తర్వాత అంతా మనవాళ్లేనన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే సీఎంవోకు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులంతా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సమస్యలను అధికారులు పరిశీలించాలన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM