కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడిగా అశోక్‌ గహ్లోత్?

by సూర్య | Sun, Jun 23, 2019, 05:25 PM

ఇటీవ‌ల ఎన్నిక‌ల‌లో పార్టీ ఘోర‌ప‌రాజ‌యంపై నైతిక బాధ్య‌త వ‌హిస్తూ, అధ్య‌క్ష‌ప‌ద‌వికి త‌ను రాజీనామా విషయంలో పార్టీ సీనియ‌ర్లు, త‌ల్లి సోనియా గాంధీ ఎన్ని వ‌త్తిళ్లు రాహుల్‌ గాంధీ పట్టు వీడకపోవడంతో త‌దుప‌రి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్ష ప‌దవికి ఎంపిక‌పై అధిష్టానం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఈ పదవి ఎవ‌రిని వ‌రించ‌బోతోంద‌న్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల‌లో నెల‌కొంది.  రేసులోకి దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అస్లాం షేర్‌ ఖాన్  కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యేందుకు   తనకు అన్ని అర్హతలున్నాయని త‌న‌ని ఎంపిక చేయాలంటూ సోనియా గాంధీని బహిరంగంగా కోరగా మ‌రోవైపు  త కర్ణాటక సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ కూడా అధ్యక్ష బాధ్యతలు  త‌న‌కు అందివ్వ‌మంటూ మ‌న‌సులోని కోరిక‌ను బైట పెట్టారు.  


తాజాగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ పేరు బైట‌కు వ‌చ్చింది.  పార్టీతో సుదీర్ఘ అనుబంధం, రాజకీయాల్లో అపార అనుభవం దృష్ట్యా   అశోక్‌కు తదుపరి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.  పార్టీ సీనియర్లు, రాహుల్ కుటుంబ సభ్యులు సైతం అశోక్‌వైపే మొగ్గు చూపిస్తుండ‌టంతో ఆత‌ని ఎంపిక సునాయాస‌మేన‌ని సమాచారం.  కాగా అధ్య‌క్ష ఎన్నిక పార్టీలో చిచ్చు పెడితే త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని క‌మ‌ల‌నాధులు కాచుకుని కూచున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌తో అస‌మ్మ‌తి రేగితే అనేక మంది త‌మ పార్టీలో చేర‌టం ఖాయ‌మ‌ని ఆ పార్టీ ఆశిస్తోంది. 


 


 

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM