వాకింగ్ కి వెళితే అదృష్టం అలా పలకరించింది!

by సూర్య | Sun, Jun 23, 2019, 07:57 PM

మన దగ్గర చాలా మంది వ్యక్తులు ఉదయాన్నే లేవడం అంటేనే భారంగా అనుకుంటారు, కానీ ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబం వాకింగ్‌కు వెళ్లి లక్షలు తీసుకొచ్చారు. వాకింగ్ కి వెళ్ళిన వారిని అదృష్టం అలా పలకరించింది.అది అలాంటి ఇలాంటి అదృష్టం కాదు.. ఏకంగా వారిని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసే బంగారం లాంటి అదృష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో సహా పెంపుడు కుక్కను వెంటబెట్టుకుని ఉదయాన్నే వాకింగ్‌కు బయలు దేరాడు. ఎప్పటిలాగే సాధారణంగా వారు నడుస్తుండగా ఆయన కుమార్తెకు ఒక రాయి కనిపించింది. ఆ రాయి మెరుస్తూ ఉండడంతో అది బంగారమేమోనని అనుమానం వచ్చిన ఆమె తండ్రిని అడిగింది. తండ్రికి కూడా అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి అది బంగారమేనని నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత దాని బరువు తెలుసుకోడానికి ఒక సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి ప్రయత్నించగా అది 1.25 పౌండ్లు ఉన్నట్లు తెలిసింది. దాదాపు విలువ 24వేల డాలర్లపైగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో అతడు అదృష్టం కలసి వచ్చిందని భావించాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో తనకు ఈ బంగారు ముద్ద దొరకడం నిజంగా తన అదృష్టమే అని మీడియా ముందు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియాలో సంవత్సర కాలంలో ఇలాంటి బంగారు రాయి బయట పడడం ఇది రెండోసారి. గత సెప్టెంబర్‌లో కూడా గోల్డ్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఒక వ్యక్తికి 7 పౌండ్ల బరువున్న బంగారు ముద్ద దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


 


 

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM