ఇక క్షేత్ర‌స్ధాయి బ‌దిలీలు షురూ

by సూర్య | Sun, Jun 23, 2019, 01:20 PM

రాష్ట్రంలో కొత్తగా  ప్రభుత్వం ఏర్పడిన ప్ర‌తిసారీ తనకు న‌చ్చిన‌ అధికారులు, ఉద్యోగుల నియామకాలు ఉండాలని భావిస్తుంది.   ప్ర‌స్తుత వైసిపి ప్ర‌భుత్వం ప్ర‌క్షాళ‌న పేరుతో బ‌దిలీల‌ను షురూ చేసింది. ఇప్ప‌టికే ఐపిఎస్‌, ఐఎ ఎస్‌ల బ‌దిలీలు జ‌రుగుతుండ‌టంతో గ‌త కొంత కాలంగా  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఖాయంగా క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్ధాయి పలువురు అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందని   భావిస్తుండ‌టంతో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌దిలీల‌పై ఉన్న నిషేధాన్ని సడలించేందుకు రంగం సిద్ద‌మైందని తెలుస్తోంది. ఈ మేర‌కు జూలై 5 నుంచి నెలరోజుల పాటు బదిలీలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మ‌చారం. ఇప్ప‌టికే. సీఎం ఆదేశాలతో బ‌దిలీ ప్ర‌క్రియ‌కు సంబంధిత  ప్రతిపాదనలు తయారు చేసిన ఉన్న‌తాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కి పంపారు. ప్ర‌స్తుతం ఈ ఫైలు సీఎం సంతకం కోసం వేచి ఉంది. ఇది పూర్త‌యితే బ‌దిలీ నిషేధాన్ని సడలిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయ‌ని అధికార వ‌ర్గాలు చెపుతున్నాయి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM