పార్టీ మారిన వాళ్లతో ఎలాంటి నష్టం లేదు : ఆలపాటి రాజా

by సూర్య | Fri, Jun 21, 2019, 05:17 PM

నలుగురు ఎంపీలు పార్టీ మారినంత మాత్రాన తెదేపాకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… భాజపాలో చేరిన నలుగురు ఎంపీలూ ఎన్నికల్లో పోటీచేసే ధైర్యంలేని వ్యక్తులని, వారికి రాష్ట్ర ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎన్నో సంక్షోభాలను చూసిన తెదేపాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పెద్ద సమస్యేమీ కాదన్నారు. తనకు తెలిసి ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారడంలేదని చెప్పారు. పార్టీలో తాజా పరిణామాలపై గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడుతూ.. తెదేపా నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులుగా తయారవుతారని వ్యాఖ్యానించారు. సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్‌కి ప్రజాదరణ లేకపోయినా పార్టీకి అంకితభావంతో ఉన్నారనే పదవులు ఇచ్చినట్లు స్పష్టంచేశారు.

Latest News

 
అప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడెలా అడుగుతావ్? పోసాని కృష్ణమురళి Wed, May 08, 2024, 07:34 PM
ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్ Wed, May 08, 2024, 07:30 PM
అప్పట్లో కేసీఆర్‌కు.. ఇప్పుడు జగన్‌కు.. షర్మిల రూటే సెపరేటు Wed, May 08, 2024, 07:27 PM
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM