ఆరోగ్య సంస్కరణలపై నిపుణుల కమిటీ ఛైర్ పర్సన్ సుజాతారావు సుదీర్ఘ చర్చ

by సూర్య | Fri, Jun 21, 2019, 04:36 PM

రాష్ట్రంలో అందరికీ  ఆరోగ్య సేవలు పూర్తి స్థాయిలో అందేలా సమగ్ర నివేదిక తయారు చేయాల్సిన బాధ్యత తమపై వుందని  ఆరోగ్య సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్ పర్సన్ కె.సుజాతారావు అన్నారు . సిఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేయనున్న నవరత్నాలలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించారు.  ముఖ్యంగా వైయస్ఆర్  ఆరోగ్యశ్రీ, 108 సేవలపై సమగ్రమంగా చర్చించారు. వైయస్ఆర్  ఆరోగ్యశ్రీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా చర్చించారు. అలాగే ఈ పధకానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయి, రాష్ట్ర బడ్జెట్ పై  ఏమేరకు భారం పడుతుందనే అంశాల్ని చర్చించారు.  పధకం అమలు ప్రారంభమయ్యాక ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉంఢేందుకు సమగ్రంగా చర్చించాలని, పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి వుంటుందని  ఆమె అభిప్రాయపడ్డారు.  ప్రస్తుతమున్న  నెట్ వర్క్ అసుపత్రులతో పాటు 20 పడకల  ఆసుపత్రుల్ని కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ్రశీ పధకంలో చేర్చితే సేవల్ని మరింతగా విస్తరించేందుకు అవకాశమేర్పడుతుందన్న సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు సూచించ‌న‌లు బాగున్నాయ‌న్నారు.  ఆరోగ్య మిత్రల గురించి చైర్ పర్సన్ సుజాతారావు  ఆరా తీశారు. వారి సేవల్ని వినియోగించుకోవడంలో  ఇబ్భందులేంటని ప్రశ్నించారు. అవసరమైతే  మరింత మందిని నియమించి సేవల్ని విస్తరించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని. తెలంగాణాలో నివాసముంటున్న ఆంధ్ర ప్రజలకు ఈ పధకాన్ని విస్తరించే అంశంపైనా చర్చించారు  

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM