రోజంతా ఉత్సాహాన్నిచ్చే యోగా : ఏపి దేవాదాయ మంత్రి

by సూర్య | Fri, Jun 21, 2019, 04:46 PM

యోగా ఆరోగ్యానికి మంచిదని ,ప్రతి ఒక్కరూ ఉదయం గంటపాటు యోగా చేస్తే రోజంతా ఉత్సాహకంగా ఉంటారని దేవాదాయ శాఖ మంత్రి వెంపల్లి శ్రీనివాసరావు అన్నారు.  శుక్ర‌వారం విజ‌య‌వాడ‌గురునానక్‌ కానీలోని ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలోఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన యోగా దినోత్స‌వ‌ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా దేవాదాయ శాఖ మంత్రి వెంపల్లి శ్రీనివాసరావు హాజరై  జ్యోతి ప్రజ్వల‌నతో ప్రారంభించారు.  అనంతరం మంత్రి వెంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌. జవహర్‌ రెడ్డి, విజయవాడ మున్సిపల్‌ కమీషనర్‌ ఎం. రామారావు, ఆయుష్‌ కమీషనర్‌  పీఏ శోభ, కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌`2 పి.బాబురావు, స్థానిక కొర్పారేటర్‌ దేవినేని అపర్ణ, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ విద్యార్ధు యోగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ  యోగా ఆచరించడంతో ఆరోగ్యంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యోగా ని జరుపుకోవటం యోగా ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుందన్నారు.  


విజయవాడ మధ్య శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ యోగా అనేది మనిషి ఇంధ్రియాల‌పై అదుపుకు దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా యోగా వల్ల‌ ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రణాళికాబద్దంగా నెకు ఒక్కసారైనా యోగా లో ప్రజలోకి తీసుకెళ్లటానికి కార్యక్రమాలు ఏర్పాటు చేయాల‌న్నారు.  

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM