అర్హులైన అర్చకులందరికీ ఇళ్లు: మంత్రి వెల్లంపల్లి

by సూర్య | Fri, Jun 21, 2019, 04:19 PM

రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన అర్చకులందరికీ అనగా సుమారు 6వేల మంది అర్చకులకు ఇళ్లు,ఇళ్లస్థలాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.శుక్రవారం అమరావతి సచివాలయం 2వ బ్లాకులో కేటాయించిన చాంబరులో మొదటిసారి అడుగుపెట్టిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా రాష్ట్రంలో దేవాదాయశాఖలో పనిచేస్తున్న అర్హులైన అర్చకులందరికీ ఇంటి స్థలాలు,ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదించిన దస్త్రం (file)పై తొలిసంతకం చేశారు. .రాష్ట్రంలోని 6-సి దేవాలయాల్లో పనిచేస్తూ దేవాదాయశాఖ ద్వారా పారితోషికం పొందుతున్న అర్చకుల పారితోషికాన్ని 25శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని దీనివల్ల సుమారు 1300 మంది అర్చకులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఇందుకుగాను 8కోట్ల 60లక్షల రూ.లు వ్యయం అవుతుందని అందుకు తగిన బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్ధికశాఖకు పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.


రాష్ట్రంలోని 11 ప్రధాన దేవాలయాలు,72ఇతర ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించి బృహత్ ప్రణాళికలు(Master Plans) రూపకల్పనకు త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు 


ఈకార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, దేవాదాయశాఖ కమీషనర్ పద్మ,ఇంకా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, సింహాచలం,అన్నవరం,శ్రీశైలం తదితర దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ అధికారులు,దేవాదాయశాఖ అధికారులు,సిబ్బంది,వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.


      (పబ్లిసిటీ సెల్,ఐఅండ్ పిఆర్,అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM