నిర్విఘ్నంగా సాగుతున్న వ‌రుణ యాగం

by సూర్య | Fri, Jun 21, 2019, 04:15 PM

విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న ఆకాంక్షతో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగం నిర్విఘ్నంగా జ‌రుగుతోంది.  దుర్గాఘాట్ వ‌ద్ద నిర్వ‌హించిన వ‌రుణ యాగంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆల‌య ఈవో కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు వరుణయాగం నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ సభ్యుడు శివప్రసాదశర్మ తెలిపారు.  దుర్గా ఘాట్‌లో 22 వరకు ఉదయం 6నుంచి 8గంటల మధ్య దేవస్థానం వేద విద్యార్థులు, రుత్వికులు వరుణజపం, వరుణానుపాక, శతానువాక, విరాటపర్వ పారాయణ చేస్తార‌ని పేర్కొన్నారు. 23న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మండపారాధనలు, దేవతామంత్ర హవనాలను రుత్వికులు నిర్వహిస్తారు. 24న ఉదయం 6 నుంచి 11 గంటల వకు కృష్ణా జలంతో మల్లేశ్వరస్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేస్తారు.  ప్రజలు సైతం ఈ యాగంలో పాల్గొనాల‌ని మంత్రికోరారు. 


 


 

Latest News

 
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు పవన్ మాత్రమే Thu, Apr 18, 2024, 01:20 PM
అనుమానాస్పదంగా రిమాండు ఖైదీ మృతి Thu, Apr 18, 2024, 01:19 PM
అక్రమంగా అతనిని హత్యకేసులో ఇరికించారు Thu, Apr 18, 2024, 01:18 PM
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యుటకి అర్హతలు, నియమాలు Thu, Apr 18, 2024, 01:18 PM
ఆత్మకూరులో అగ్నిప్రమాదం Thu, Apr 18, 2024, 01:17 PM