ప్ర‌ధాని 4- పి ఉప‌దేశం

by సూర్య | Fri, Jun 21, 2019, 01:19 PM

ఆరోగ్యకరమైన జీవితాల కోసం నాలుగు 'పి మంత్రాలు  ఉప‌దేశించారు ప్ర‌ధాని మోడీ -  పానీ (తాగునీరు), పోషన్ (పోషణ), పర్యావ‌ర‌న్ (పర్యావరణం) మరియు పారిశ్రామ్ (హార్డ్ వర్క్) ల‌ద్వారా జీవితాల‌లో పెనుమార్పులు తీసుకు రావ‌చ్చ‌ని అన్నారు. శుక్రవారం రాంచీలొ    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి ప్రభాత్ తారా మైదానంలో సుమారు 30,000 మందితో పాటు మోడీ యోగా చేశారు. ఈసంద‌ర్భంగా  ప్ర‌ధాని  మోడీ  మాట్లాడుతూ  దేశంలోని పేద ప్రజలకు, గిరిజన ప్రాంతాలకు యోగా చేరలేదని,  యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకునేలా ప్ర‌జ‌లు త‌మ దైనందిత జీవితాన్ని మార్చుకోవాల‌ని పిలుపు ఇచ్చారు, పేద ప్రజలు వ్యాధుల బారిన పడుతుండ‌టం  అది వారిని మ‌రింత పేదలుగా చేస్తోందని, సంపూర్ణ ఆరోగ్యం పొంద‌టానికి యోగా ఒక మాధ్యమం అని, ఆరోగ్యం ఉంటే పేదరికం నుండి బయటకు వ‌చ్చేందుకు అన్ని అనుకూలంగా మారుతాయ‌ని అన్నారు. అన్నారు.   "శాంతి, సామరస్యం ,  పురోగతి కోసం యోగాష‌   నినాదం కావాల‌న్నారు.  గత ఐదేళ్లలో ప్రభుత్వం  ప్ర‌జ‌ల ఆరోగ్య సంరక్షణ కోసం అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని, అయితే ప్ర‌జ‌ల ఆరోగ్యం యోగాతో ముడిపడి ఉందని తెలుసుకోవాల‌న్నారు.  గుండె  సంబంధిత వ్యాధులు ఉన్న వారు కూడా  యోగాను స్వీకరించి, అను నిత్యం చేయ‌టం ద్వారా దానిని నివారించుకోవ‌చ్చ‌ని అన్నారు.   మారుతున్న కాలానుగుణంగా అనేక‌ అనారోగ్యాలు వెంటాడుతుంటాయి, వాటి నివారణ చర్యలు తీసుకోవ‌టం ద్వ‌రా మ‌న ఆరోగ్యంపై దృష్టి  కేంద్రీక‌రించాల్స‌న అవ‌నం ఉంద‌ని, ఇందుకు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన జీవితాన్ని అందించే  యోగాని అల‌వ‌ర‌చుకోవాల‌ని అన్నారు.  వయస్సు, ధనిక, పేద, కులం, మతం, ప్రాంతం   సరిహద్దులు ఇవేవి లేని అధ్య‌య‌నం యోగా అని చెప్పారు.  యోగా పురాతనమైనదే కాదు కాలానుగుణ మార్పుల‌తో ఆధునికమైనది.  స్థిరమైనది  అభివృద్ధి చెందుతున్నది. ఏకత్వం. యోగా ప్రతి వ్యక్తి ఆలోచనల‌ను  మెరుగుపరుస్తుంది "అని మోడీ అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో  ప్ర‌ధాని మోడీతో పాటు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి రామ్‌చంద్ర కేసరితో పాటు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు 


 


 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM