అమెరికా సంచలన నిర్ణయం

by సూర్య | Fri, Jun 21, 2019, 11:23 AM

డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నెవార్క్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో యునైటెడ్ ఎయిర్ లైన్స్ నడపాల్సిన విమానాలు రద్దు కాగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ అధీనంలో ఉన్న గగనతలంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించిందంటూ, ఇరాన్ ఆ డ్రోన్ ను కూల్చివేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్‌ అధీనంలోని గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లవద్దని యూఎస్ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించారు. విమానాల రద్దు ఎంతకాలమో మాత్రం చెప్పలేదు. కాగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్ తో పాటు అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌, డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కూడా ఇరాన్‌ మీదుగా తాము నడిపే విమానాలను రద్దు చేసుకున్నాయి.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM