క‌మ‌లం వైపు జితిన్ ప్ర‌సాద అడుగులు?

by సూర్య | Fri, Mar 22, 2019, 10:42 PM

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి  జితిన్ ప్రసాద కాంగ్రెస్ ను వీడి బీజేపీ చేరుతారనే వార్తలు వచ్చినప్పటికీ ఈ  విషయం లో యింకా సస్పెన్స్ కొనసాగుతోంది. 2004, 2009 లో ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్ సభ కు ఎన్నికై కేంద్ర  వ్యవహరించిన జితిన్ ప్రసాద ఇటీవల కాలం లో కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత అసంతృప్తి తో వున్నారు. గతం లో తాను గెలిచిన. దౌరారా నియోజకవర్గ నుంచి కాకుండా లక్నో నుంచి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించడం తో జితిన్ ప్రసాద కినుక వహించారని తెలుస్తోంది. దాంతో బీజేపీ నేతలు కూడా ప్రసాద తో సంప్రదింపులు జరిపారనని, రేపో, మాపో ప్రసాద బీజేపీ లో  చేరడం ఖాయమని బీజేపీ వర్గాల భోగట్టా. అయితే తాను కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరుతానని వార్తల పై స్పందింస్తూ ఆ వార్తలు ఊహాజనితామని, వాటిపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రసాద పేర్కొన్నారు. అయితే ప్రసాద స్పందన పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్అబ్దుల్లా సంతృప్తి చెందలేదు.బీజేపీ లో చేరే విషయం పై సరైన సమాధానం ఇవ్వలేదని, తాను కాంగ్రెస్ వీడడం లేదని ప్రసాద స్పేటం అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద  గతం లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు రాజకీయ సలహాదారుడిగా చేసారు. అయితే సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కు దూరమయ్యారు. అంతే కాకుండా సోనియా గాంధీ  పై  పోటీ చేసి జితేంద్ర ప్రసాద పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి ఉత్తర ప్రదేశ్ తో పాటు దేశంలో పూర్వ వైభవాన్ని తేవడానికి కృషి జరుగుతున్న తరుణంలో ప్రసాద కాంగ్రెస్ ని వీడడం తప్పనిసరిగా ఇబ్బందుల పలు చేస్తుంది. ఇప్పటికే గాంధీ కుటుంబం సన్నిహితంగా వున్నా టామ్ వాడక్కన్ పార్టీ ని వీడి బీజేపీ లోచేరారు.ఎన్నికలు జరుతుగున్న సమయం లో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పార్టీ ని వదిలి బీజేపీ లో చేరుతున్నారు.


 


 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM