ఆమదాలవలస బరిలో మామా అల్లుళ్ల స‌వాల్‌

by సూర్య | Fri, Mar 22, 2019, 11:13 PM

సమీప బంధువుల మధ్యే పోటీ , నువ్వా నేనా అన్న రీతిలో పోరు రసవత్తరంగా మారుతుంది. శ్రీ‌కాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గంలో  వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం, టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సమీప బంధువులు. సీతారాంకు రవికుమార్‌ స్వయాన మేనల్లుడు. రవికుమార్‌ అక్కకు సీతారాం వివాహం చేసుకున్నారు. ఈ లెక్కన బావా బావమరుదులు కూడా. గ‌తంలో ఒకే పార్టీలో ఉన్న వీరిలో  2001లో కొన్ని అంశాల్లో నియోజకవర్గ నాయకత్వంతో విభేదాలు రావడంతో రవికుమార్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. కానీ తాను జడ్పీటీసీగా పోటీ చేయడంతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులతో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ పెట్టి గెలిపించుకుని స‌త్తా చాటారు.. తాను జడ్పీటీసీగా, భార్య ప్రమీలా ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదో హాట్‌ టాపిక్‌. ఆ సమయంలో తమ్మినేని, కూన కుటుంబాలు ఏకతాటిపై కి వ‌చ్చాయి. కానీ 2009లో పీఆర్పీ ఆవిర్భావం తరువాత తమ్మినేని ఆ పార్టీలో చేరడం . పునర్విభజనతో పొందూరు మండలం ఆమదాలవలసలో క‌ల‌వటం టీడీపీకి రవికుమార్‌ పెద్దదిక్కు అయ్యారు.


మామ వెంట నడవకుండా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. త్రిముఖ పోటీల్లో ఎమ్మెల్యేగా సత్యవతి గెలుపొందారు. రెండోస్థానంలో కూన రవికుమార్‌, మూడో స్థానంలో తమ్మినేని నిలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రవికుమార్‌, వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం నిలవగా...రవికుమార్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఇద్దరూ పోటీచేస్తున్నారు.


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM