కాలేజీలు ఏర్పాటు చేస్తా - జ‌న‌సేన అభ్య‌ర్ధి పోతిన మహేష్

by సూర్య | Fri, Mar 22, 2019, 10:38 PM

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీపీఐ, సిపిఎం, బీఎస్పీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి పోతిన మహేష్ అన్నారు. శుక్రవారం 35వ డివిజన్లో జనసేన ప్రచార యాత్ర నిర్వహించారు...కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు.  వామపక్షాలతో కలిసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి నిరాహార దీక్ష, ఎన్నో పోరాటాల చేశామని గుర్తు చేశారు.. ఆలాగే ప్రతి ఒక్కరికి విద్య అవసరమని, అందుకు నియోజకవర్గంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీతో  పాటు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు...విద్య ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబానికి లేదా సమాజానికి ఉపయోగపడుతుందన్నారు.. అదేవిధంగా ఆర్థికంగా స్థిరపడేందు దోహదపడుతుందని చెప్పారు.. రాజధాని నగరంతో పాటు దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య తో పాటు బస్ పాస్ సౌకర్యం, ఇంటర్, డిగ్రీ కళాశాలలో ఉచిత  క్యాంటీన్ లు, ల్యాప్ టాప్ లను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో కల్పించారని చెప్పారు...తమ  నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు  చదవాలని చెప్పారు...  ఇది రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని చెప్పారు.. గాజు గ్లాసుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు...ఈ కార్యక్రమంలో చిన్నబాబు,రమేష్ మాస్టర్, ఎల్.శివ ప్రసాద్, బాస్కర్, బి.రాంబాబు, పోతురాజు, రమాదేవి,శివ, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


 


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM