పాక్ నేష‌న‌ల్ వేడుక‌ల‌ను బ‌హిష్క‌రించిన‌ భార‌త్‌

by సూర్య | Fri, Mar 22, 2019, 07:43 PM

 ప్రతి ఏడాది  మార్చి23న జ‌రిపే  నేషనల్ డే  వేడుకలను ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకుంటోంది పొరుగు దేశ‌మైన పాకిస్థాన్‌.  ఎన్నో ఏళ్ల‌గా ఆనవాయితీగా మ‌న దేశం తరఫున ఒక కేంద్ర మంత్రి ఒక‌రు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతు వ‌స్తున్నారు. పుల్వామా ఉగ్ర దాడి తరవాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిని, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అధికారులను  పాక్‌ భద్రతా సిబ్బంది  వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి చూసాయి.  ఈవిష‌య‌మై మార్చి 18న పాక్‌ విదేశాంగ శాఖకు భారత్‌ నివేదిస్తూ,  త‌క్ష‌ణ విచార‌ణ కోరినా చ‌ర్య‌లు లేక‌పోవటంపై భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తోంది. పైగా ఈ కార్యక్రమానికి కశ్మీర్‌ వేర్పాటువాద నేతలను ఆహ్వానించడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM