టిక్కెట్ లేకుంటే జంప్‌.. క‌ల్లోలంలో మాయా కూట‌మి

by సూర్య | Thu, Mar 21, 2019, 10:23 PM

  బ‌ద్ధ విరోధులైన ఎస్‌పీ, బీఎస్‌పీ జ‌ట్టుక‌ట్టి  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మెజార్టీ స్థానాలు కైవ‌శం చేసుకుని కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని చాన్నాళ్లుగా చేసిన ప్ర‌య‌త్నాలు దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చాయి.  కాంగ్రెస్ పార్టీని కూడా ప‌క్క‌న పెట్టి ప‌క్క‌న‌పెట్టి బీజేపీ ఓట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపాయి.  అయితే ఇన్నాళ్లు  త‌మ‌కు కూట‌మి క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్న మాయా. అఖిలేష్‌ల‌కి ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎస్‌పీ, బీఎస్పీలో టికెట్లు ద‌క్క‌క పెద్ద సంఖ్య‌లో కీల‌క నేత‌లు బీజేపీలోకి వ‌ల‌స వెళ్లిపోతుండ‌టంతో రోజు రోజుకీ ప‌రిస్తితి దిగ‌జారుతుండ‌టంతో ఇది కూట‌మికి న‌ష్టం చేకూరుస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
పొత్తుల కార‌ణంగా రెండు బ‌ల‌మైన పార్టీలు కావ‌డంతో చాలాచోట్ల రెండు పార్టీల నాయ‌కులు సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తోంది. అదికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామ‌ని ఇరు పార్టీల అగ్ర‌నేత‌లు స‌ర్ది చెబుతున్నా.. బీజేపీని దాటుకుని అధికారంలోకి వ‌స్తుందా.. అన్న సందేహం మాత్రం వెంటాడుతుండ‌టం కూడా వ‌ల‌స‌ల‌కు తావిస్తోంది. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM