గోద్రా రైలు ద‌హ‌నం నిందితుడికి జీవిత ఖైదు

by సూర్య | Wed, Mar 20, 2019, 10:29 PM

2002లో భార‌త దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన‌ గుజరాత్  గోద్రా స్టేషన్  రైలు దహన కేసులోఎట్ట‌కేల‌కు  అహ్మదాబాద్ ప్రత్యేక సిట్ కోర్టు యాకుబ్ పటాలియాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 27 ఫిబ్రవరి 2002 లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 బోగీకి గోద్రా స్టేషన్ దగ్గర దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైనది. వీరిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు.ఈ ఘటన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి 31 మార్చి 2002 వరకు గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి. వీటిలో దాదాపు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 1500 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిన విష‌యం విదిత‌మే.  గుజరాత్ పోలీసులు యాకూబ్‌, ఆత‌ని సోద‌రులే నిందితులుగా గుర్తించి  2002 సెప్టెంబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఐపీసీ, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇదే కేసులో యాకూబ్ సోదరుడు కాదిర్ పటాదియా 2015లో అరెస్ట్ చేయ‌గా,. విచారణ  స‌మ‌యంలోనే 2015లో జైల్లో మరణించాడు.  అలాగే యాకూబ్ మరో సోదరుడు అయూబ్ పటాలియా వడోదరా సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా  2018 జనవరిలో యాకుబ్‌ని గోద్రాలో అరెస్ట్ చేసి సిట్ ముందు హాజ‌రు ప‌రిచారు. . బుధవారం రోజున యాకుబ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక సిట్ కోర్టు తీర్పు వెలువరించింది. 


 


 


 

Latest News

 
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM