గూగుల్‌కు మ‌రోమారు భారీ జరిమానా

by సూర్య | Wed, Mar 20, 2019, 10:21 PM

త‌న యూజర్లకు నమ్మకం ద్రోహంతోపాటు ఇతర కంపెనీలను పోటీ పడకుండా అడ్డుకుందంటూ  యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ గూగుల్‌కు మ‌తిపోయే శిక్ష వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  తన విధులను విస్మరించి విశ్వాసం పోగొట్టుకుందని కోర్టు ఆక్షేపిస్తునే రూ. 11,730 కోట్లపైచికులు జరిమానా చెల్లించాల‌ని తేల్చి చెప్పింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్‌ గూగుల్‌కు మళ్లీ భారీ జరిమానా పడటం ఇది కొత్త‌కాదు.  గ‌త పదేళ్లుగా ఇతర కంపెనీలపై ఆధిపత్యం చలాయిస్తోంది. ఇదిలాగే జరిగే కంపెనీ దారునంగా దెబ్బతింటుంది..’ అని హెచ్చరించారు. విశ్వాస ద్రోహం కింద గూగుల్ సంస్థకు ఇదివరకు కూడా పలు కోర్టులు భారీ జరిమానాలు వేశాయి. .తాజా జ‌రిమానా విష‌యం మీడియాకు  ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ మార్గరెట్‌ వెస్టాగర్  తెలియ జేస్తూ, అంతర్జాతీయ మార్కెట్‌లో తనకున్న  పేరును, అధికారాలను దుర్వినియోగం చేస్తున్న గూగుల్‌లోని   కంపెనీలు భారీ లాభాలు సంపాదిస్తున్నా;  వినియోగదారులు మాత్రం మోసపోతున్నారని అన్నారు. దీనికి తోడుగా  తన యూజర్లను ప‌దే ప‌దే ఇబ్బంది పెట‌ట్ట‌డంతో పాటు వారి ఆప్షన్లను కట్టడి చేస్తున్న విష‌యాన్ని గుర్తించిన యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ  కోర్టు  సంస్థకు 1.49 బిలియన్‌ యూరోల జరిమానా చెల్లించాల‌ని ఆదేశించంది. దీంతో  తాజా జరిమానాతో మొత్తం పెనాల్టీల మొత్తం రూ. 72 వేల కోట్లకు చేరటంవిశేషం. 

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM