పోల‌వ‌రాన్ని విషం చిమ్ముతున్న‌ కేసీఆర్ - మంత్రి దేవినేని ఉమా ఆగ్ర‌హం

by సూర్య | Tue, Mar 19, 2019, 01:45 AM

పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం, కేసిఆర్ విషం చిమ్ముతున్నారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. సోమవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలవరం బ్యాక్ వాటర్ స్టడీ చేయాలని సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగిందని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మంత్రి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పోలవరంపై కేసులు వేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమ్మతి, ప్రభుత్వ అనుమతితో చాలా స్పష్టంగా విభజన చట్టంలో 93 క్లాజ్‌లో వారి పూర్తి అంగీకారాన్ని తెలిపినట్లు తెలియజేస్తూ పొందుపరచడం జరిగిందన్నారు. కేసిఆర్ సూచించిన అధికారుల కనుసన్నల్లోనే విభజన చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసిఆర్‌కు సామంతరాజుగా జగన్మోహ‌న్ రెడ్డి ఉండటం వల్లే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేయడం సాధ్యమైంద‌ని తెలిపారు. ఇప్పటికి 67.2 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా అడ్డుకుందన్నారు. పోలవరం కోసం ఖర్చుపెట్టిన రూ.4341 కోట్ల నిధులు కేంద్రప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. జూన్‌లో గ్రావిటి ద్వారా నీరిచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల్లో లేని అనునానాలు సృష్టిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేసిఆర్ వ్యవహరిస్తుంటే, స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ కేసిఆర్‌కు తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బకొట్టడానికి జగన్మోహ‌న్‌ రెడ్డి కేసిఆర్‌తో కలవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కేసు వేయడం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంగించినట్లేనని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులు బాగుపడతారని అది ఇష్టంలేక కేసిఆర్ కేసులు వేస్తున్నారని తెలిపారు. కేసిఆర్ ఇచ్చే వెయ్యి కోట్లకు కక్కుర్తిపడి వారితో చేయి కలిపి రాష్ట్రానికి జగన్మోహ‌న్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని ఉమా అన్నారు. పోలవరం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసి అడ్డుకుంటుంటే వారితో జగన్మోహన్ రెడ్డి చేతులు కలపడం దుర్మార్గమన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే గుండెపోటని త‌న సొంత ప్ర‌సార మాధ్య‌మాల్లో ప్రసారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ హత్యా, శవ రాజకీయాలు చేస్తున్నారని ఉమా మండిపడ్డారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM