మరోసారి కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్....

by సూర్య | Fri, Oct 25, 2024, 12:30 PM

రెండో టెస్టులో టీమిండియా కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రెండవ రోజు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ లో.. టీమ్ ఇండియాకు మళ్ళీ కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. 38 ఓవర్లు వాడిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. నిన్న రోహిత్ శర్మ డక్ అవుట్ కాగా ఇవాళ ఉదయం నుంచి టీమ్ ఇండియా బ్యాటర్లు వరుసగా అవుట్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ ఒక పరుగుకే మరోసారి నిరాశపరిచాడు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు, శుభమనగిరి 30 పరుగులు చేసి రాణించారు. మొదటి టెస్టులో అదరగొట్టిన రిషిబ్ పంత్ 18 పరుగులు , సర్ఫరాజ్ ఖాన్ 11 పరుగులు చేసి నిరాశపరిచారు.


రెండవ రోజు లంచ్ సమయానికి 7 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది టీం ఇండియా. మరో 152 పరుగులు చేస్తే కానీ లీడ్లోకి రాదు టీమిండియా. న్యూజిలాండ్ బౌలర్లలో కూడా స్పిన్నర్లే రాణిస్తున్నారు. గ్రీన్ ఫిలిప్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ మీచల్ శాంట్నర్ నాలుగు వికెట్లు తీశాడు. టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. మొదట పర్వాలేదనిపించిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే బౌలింగ్ తో న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్.

Latest News

 
విజయవాడలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది, గదిలో ముగ్గురు Wed, Oct 30, 2024, 10:56 PM
ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి! Wed, Oct 30, 2024, 10:50 PM
పవన్ కళ్యాణ్ ప్రతిపాదన.. వెంటనే ఓకే చెప్పిన సీఎం చంద్రబాబు Wed, Oct 30, 2024, 10:46 PM
సీఎం చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ బాబా.. అసలు కారణం ఇదే! Wed, Oct 30, 2024, 10:42 PM
అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ Wed, Oct 30, 2024, 10:12 PM