by సూర్య | Fri, Oct 25, 2024, 12:10 PM
మార్టూరు లోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు అందజేసి అక్కడే పరిష్కరించటం జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
Latest News