by సూర్య | Fri, Oct 25, 2024, 11:40 AM
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గురువారం బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా స్థానిక నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు ప్రసాద్ రావు ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి రూ. 70 వేల రూపాయలు మంజూరు చేసి చెక్కును ఆయన అందజేశారు.
Latest News