అన్నమయ్య జిల్లాలో దారుణం ..గ‌ర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక‌

by సూర్య | Fri, Oct 25, 2024, 11:21 AM

ఈ నడుమ అమ్మాయిలను ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తున్న దారుణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీనేజ్ బాలికలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భం చేస్తున్న మోసగాళ్లకు కొదువ లేకుండా పోతోంది.చిన్న వయసులో ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా మోసపోతున్నారు బాలికలు. తాజాగా ఏపీలో ఓ అమ్మాయి పక్కింటికి వచ్చే అబ్బాయితో ఇలాగే ప్రేమలో పడింది. చివరకు ఆ యువకుడు ఆమెకు గర్భం చేయడంతో ఇంట్లో వాళ్లంతా కుమిలిపోతున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని కురబలకోట మండలానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక మదనపల్లెలోని బాలికల ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె పక్కింటికి ఖాదర్ భాషా(24) అనే యువకుడు నిత్యం వస్తూ ఉండేవాడు. ఇతను లక్కిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ భాషా కొడుకు. తరచూ పక్కింటికి వస్తుండటంతో బాలికతో పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమకు దారి తీసింది. బాలిక కూడా అతన్ని గుడ్డిగా నమ్మేసింది. చివరకు గర్భం దాల్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టింది. చివరకు బాలిక తల్లి ఆరు నెలలకు పసిగట్టి ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ నడుమ ఏపీలో ఇలాంటి ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ బాలికపై వంట మాస్టర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మరవక ముందే ఈ దారుణం చోటుచేసుకుంది.

Latest News

 
పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచనలు Wed, Oct 30, 2024, 04:05 PM
సురక్షిత మంచినీటిని అందించడంమే లక్ష్యం Wed, Oct 30, 2024, 03:51 PM
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: వనమా Wed, Oct 30, 2024, 03:51 PM
ఎచ్చెర్ల: సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఘననివాళిలు Wed, Oct 30, 2024, 03:50 PM
ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందంటే..? Wed, Oct 30, 2024, 03:47 PM