by సూర్య | Fri, Oct 25, 2024, 10:31 AM
ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవట్లేదంటూ, మయోనైజ్‌ని నిషేధించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది.
Latest News