by సూర్య | Thu, Oct 24, 2024, 09:46 PM
మాజీ సీఎం జగన్ వల్ల అమరావతి రైతులు కష్టాలు పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. "అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి సంబంధించి 15 రోజుల్లో పాత కాంట్రాక్టులు రద్దు చేస్తాం. డిసెంబర్ చివరిలోగా అన్నిపనులకు టెండర్లు పిలుస్తాం. జనవరి నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తాం. దాచేపల్లిలో డయేరియాపై అధికారులతో చర్చించాం. నీటి నమూనాలను పరీక్షలకు పంపించాం" అని మంత్రి నారాయణ తెలిపారు.
Latest News