by సూర్య | Thu, Oct 24, 2024, 09:46 PM
దానా తుపాన్ ఒడిశా తీరం దాటనుందని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సూచించారు. దానా తుపాన్ ప్రస్తుత పరిస్థితిపై గురువారం అమరావతిలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాయువ్య బంగాళాఖాతంలోని దానా తీవ్ర తుపానుగా రూపు దాల్చిందని వాతావరణ శాఖ పేర్కొన్నట్లు తెలిపారు.
ఒడిశాలోని పారాదీప్‌కి 180 కి.మీ, ధమ్రాకు 210 కి.మీ. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 270 కి.మీ దూరంలో ఈ తుపాన్ కేంద్రీకృతమైందని ఆయన వివరించారు. ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతు ఉత్తర-వాయువ్య దిశగా గురువారం అంటే అక్టోబర్24వ తేదీ అర్ధరాత్రి నుంచి శుక్రవారం అంటే అక్టోబర్25వ తేదీ ఉదయం లోపు పూరీ - సాగర్ ద్వీపం మధ్య భిటర్కానికా, ఒడిశాలోని ధమ్రా సమీపంలో దానా తీరం దాటే అవకాశం ఉందన్నారు.
Latest News