డిస్టిలరీ ఫ్యాక్టరీలో కొనసాగుతున్న సీఐడీ అధికారులు

by సూర్య | Wed, Oct 23, 2024, 08:19 PM

కడప నగర పరిధిలో ఉన్న ఈగల్‌ డిస్టిలరీ ఫ్యాక్టరీలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిస్టిలరీ ఫ్యాక్టరీలలో సీఐడీతో పాటు ఎక్సైజ్‌ అధికారులు కలిసి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. డిస్టిలరీలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. అలాగే మద్యం తయారు చేసే పదార్థాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గతంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కూడా ఈ డిస్టిలరీలో తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కూడా సీఐడీ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించడంతో పాటు స్వాఽధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు సమాచారం. అయితే డిస్టిలరీ ఫ్యాక్టరీలోకి ఎవరినీ అనుమతించలేదు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది Thu, Oct 24, 2024, 03:28 PM
తండ్రినే ముద్దాయిని చేసిన వ్యక్తి జగన్ అంటూ సోమిరెడ్డి విమర్శలు Thu, Oct 24, 2024, 03:16 PM
డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ జ‌గ‌న్‌ ఆగ్ర‌హం Thu, Oct 24, 2024, 02:46 PM
బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ అనంత‌రం ఏపీపీఎస్సీ బోర్డు స‌భ్యులు, అధికారుల‌తో అనురాధ స‌మీక్ష Thu, Oct 24, 2024, 02:43 PM
పెనుగొండ: నీటి ట్యాంకులను శుభ్రం చేయించిన సర్పంచ్ Thu, Oct 24, 2024, 01:07 PM