ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:12 PM

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా కేబినెట్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ జరగనుంది. గత కేబినెట్‌లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ నాటికి పరిస్థితిలో మార్పు రావాలని.. ఎక్కడ ఇసుక దొరకడం లేదు... రేట్ ఎక్కువ అనే మాట వినపడకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరి తీరాలని గత కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఏ విధంగా లఅమలు అవుతున్నాయి. డ్రోన్ సమ్మిట్ అంశంతోపాటు పలు కీలకాంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM