దీపావళి కానుకగా అమలులోకి దీపం పథకం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:11 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా కేబీనెట్ సమావేశం జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల అదనపు భారం అవుతుంది.


దీని అమలుకు పూర్తి స్థాయిలో కేబినెట్‌లో సీఎం చంద్రబాబు మంత్రి మండలిలో దిశ నిర్దేశం చేస్తారు. దీంతోపాటు గత ప్రభుత్వం విశాఖలో శారద పీఠానికి గత ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూములను రద్దు చేసే అంశంపై కేబీనెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో వందకోట్లు పైబడి జ్యూడిషియల్ రివ్యూ ప్రివ్యూ కమిటీ ఏర్పాటు చేసింది. తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం.. ఇది మొత్తం ఓ విష సర్కిళ్లా ఈ అంశాన్ని తీసుకువచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్షించి జ్యూడీషియల్ ప్రీవ్యూ కమిటీని రద్దు చేసే అవకాశముంది.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM