చంద్రబాబు నాయకత్వంలో పనిచెయ్యడం నా అదృష్టం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:10 PM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 120 రోజులు దాటుతోంది. ఈ నాలుగు నెలల పాలన ఎన్నో సంతృప్తికరంగా ఉంది. విజయవాడ నగరాన్ని బుడమేరు వరదలు ముంచెత్తిన సమయంలో 12 రోజులపాటు సీఎం చంద్రబాబు బాధితులకు అండగా ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించిన తీరు మాలాంటి వారికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అయన మాట్లాడుతూ.... వరద బాధితులకు ఏం కావాలో వారి కన్నా ఎక్కువగా ఆలోచన చేసి వాటన్నింటినీ సమకూర్చిన ఘనత చంద్రబాబుదే. ఇళ్లను ఫైరింజన్లతో శుభ్రం చేయించడం వంటివన్నీ 74 ఏళ్ల యువకుడు చేసిన వినూత్న ఆలోచన. అలాంటి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.


అందులో భాగంగా పింఛను రూ.4వేలుకు పెంచి బకాయిలతో సహా రూ.7వేలు తొలి నెలలో అందజేశాం. ఒకటో తేదీన రూ.7 వేలు అందుకున్న పింఛన్‌దారుల మొహాల్లో ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడేలా చూస్తున్నాం. అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాం. వాటిని గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించినా వాటి విలువను పేదలకు తెలిసేలా చేసిన ఘనత మాత్రం వైసీపీ వారిదే. వారు అధికారంలోకి రాగానే వాటిని మూసివేయబట్టే మేం పునఃప్రారంభించగానే పేదలు, మధ్యతరగతి నుంచి అన్న క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభించింది. దీపావళి నుంచి మూడు సిలిండర్లు అందించనున్నాం. భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఇసుక అందజేస్తున్నాం. ఇవన్నీ 120 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం అని తెలియజేసారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM