నల్లమిల్లి బీరు ఫ్యాక్టరీలో సీఐడీ తనిఖీలు

by సూర్య | Wed, Oct 23, 2024, 08:10 PM

రంగంపేట మండలం కోటపాడు, నల్లమిల్లి బీరు ఫ్యాక్టరీలలో ఏకకాలంలో మంగళవారం ఉదయం 9 నుంచి అర్ధరాత్రి వరకూ విశాఖపట్నం నుంచి వచ్చిన సీఐడీ అధికారులు రెండు టీమ్‌లుగా ఏర్పడి సోదాలు చేశారు.సీఐడీ డిఎస్పీ కుమార్‌స్వామి ఆధ్వర్యంలో కోటపాడు బీరు ఫ్యాక్టరీ , సీఐడీ డిఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నల్లమిల్లి బీరు ఫ్యాక్టరీలోనూ గేట్లు తాళాలు వేసి ఎవరినీ లోపలికి అనుమతించకుండా సోదా లు చేశారు.గత వైసీపీ ప్రభుత్వం అధికాంలో ఉన్న 2019 నుండి 2024 వరకు జరిగిన మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కోటపాడులో ఉన్న ఫ్యాక్టరీ నెలకు ఒకకోటి ఏబై లక్షల మద్యం సీసాలను తయారు చేసే సామర్ధ్యం కలిగిన ఫ్యాక్టరీ. సోదాల్లో మద్యం తయారీకి, అమ్మకాలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులను సీజ్‌ చేస్తున్నారని తెలిసింది. సోదాలు రెండో రోజు బుధవారం కొనసాగే అవకాశాలున్నాయి.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM