గర్భిణికి వీలైనంత వరకు నార్మల్‌ కాన్పు కలిగించాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:07 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయ్యే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటరమణ సూచించారు. మహానంది మండలంలోని ఎం.తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగంతో పాటు రికార్డులు, రిపోర్టులను, కాన్పుల వార్డును పరిశీలించారు.


డీఎంహెచ్‌వో మాట్లాడుతూ కాన్పునకు వచ్చే ప్రతి గర్భిణికి వీలైనంత వరకు నార్మల్‌ కాన్పు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టి, మాతా శిశు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ఐఈసీ మెటీరియల్‌ ప్రదర్శనను అవగాహన కోసం ప్రజలకు, రోగులకు అందుబాటులో ఉండే విధంగా ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి భగవాన్‌దాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
గుంటూరువాసులకు సూపర్ న్యూస్.. ఏసీలో దర్జాగా, కేంద్రానికి చంద్రబాబు సర్కార్ రిక్వెస్ట్‌తో Sat, Oct 26, 2024, 07:48 PM
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం, నాలుగు నెలల తర్వాత Sat, Oct 26, 2024, 07:47 PM
తిరుపతి రైల్వే స్టేషన్‌లో గంటన్నర హైడ్రామా.. భార్యాభర్తల కేకలు, ఏమైందంటే Sat, Oct 26, 2024, 07:45 PM
ఏపీలో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి, లైసెన్స్‌ తీసుకునేవారికి శుభవార్త Sat, Oct 26, 2024, 07:44 PM
శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 28 రోజుల్లో ఎన్ని కోట్లంటే! Sat, Oct 26, 2024, 07:42 PM