by సూర్య | Thu, Jul 11, 2024, 05:20 PM
ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పుట్టపర్తిని మరింత అభివృద్ధి చేయడానికి సహాయసహకారాలు అందించాలని ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి నూతన కలెక్టరు టీఎస్ చేతనను కోరారు. బుధవారం ఎమ్యెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తిని పర్యాటకంగా అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరారు. ఎమ్యెల్యే వెంట కౌన్సిలర్ రత్నప్పచౌదరి, మునిసిపల్ మాజీ చైర్మన చలపతి, నాయకులు రామాంజినేయులు, కడియాల సుధాకర్ నాయుడు, మహ్మద్ రఫీ ఉన్నారు.
Latest News