హైవే నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తిచెయ్యాలి

by సూర్య | Thu, Jul 11, 2024, 05:19 PM

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కనిగిరి ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌ ఆదేశించారు. భూ వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. మర్రిపూడి మండల పరిషత్‌ సమావేశం హాలులో రైతులు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడారు. రైతుల సమస్యల కారణంగా రహదారి పనులకు అవాంతరాలు ఏర్పడటానికి వీలులేదన్నారు. మండలంలోని పన్నూరు, మర్రిపూడి, కూచిపూడి, తిప్పలదేవిపల్లె, గార్లపేట గ్రామాలకు చెందిన 66 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయాల్సింది ఉందని ఈసందర్భంగా ఆయన వివరించారు. రెం డు, మూడు రోజుల్లో రైతులు తామంతట తాము వివాదాలు పరిష్కరించుకుని నష్టపరిహారం తీసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆయన.. పనితీరు మార్చుకోకపోతే కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వరప్రసాద్‌, త హసీల్దార్‌ కె.బి.టి.సుందరమ్మ, డిప్యూటీ తహసీల్దార్‌ కేఆర్‌ భూపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
ఏలూరు జిల్లాలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ హాజరు Thu, Oct 31, 2024, 10:28 PM
నవంబరు 1న ఈదుపురం సభలో పథకం ప్రారంభించనున్న చంద్రబాబు Thu, Oct 31, 2024, 10:25 PM
పోలవరం ఎత్తు విషయంలో స్పష్టత ఇచ్చినా జగన్ బుద్ధి మారడంలేదన్న మంత్రి నిమ్మల Thu, Oct 31, 2024, 10:19 PM
ఏపీలో వేర్వేరు చోట్ల బాణసంచా ప్రమాదాలు... ముగ్గురి మృతి Thu, Oct 31, 2024, 06:51 PM
దెందేరు నుంచి పురిటిపెంటకు మారిన సీఎం పర్యటన Thu, Oct 31, 2024, 04:40 PM