by సూర్య | Thu, Jul 11, 2024, 05:20 PM
విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలోని ముచ్చర్లలో డీపట్టా భూమి ఆక్రమణకు గురైనట్లు గ్రామస్థుల ఫిర్యాదు మేరకు బుధవారం మండల సర్వేయర్ అప్పలనాయుడు, ఆర్‌ఐ మురళితోపాటు రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టారు. సర్వే నెంబర్ 263లో గల డిపట్టాలో కొంత భాగాన్ని గ్రామానికి చెందిన రక్షణశాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మీసాల సన్యాసినాయుడుకు నాలుగు ఎకరాల 97 సెంట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంతో పాటు మరి కొంత భూమిని ఆక్రమించుకున్నట్లు గ్రామానికి చెందిన మజ్జికృష్ణ, రమణలతో పాటు పలువురు ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. దీంతో తహసీల్దార్ సీహెచ్ రమేష్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి సన్యాసినా యుడుకుకేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించి ఆక్రమణ ఉన్న చోట ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేయడంజరిగిందని తహసీల్దార్ తెలిపారు.
Latest News