by సూర్య | Thu, Jul 11, 2024, 05:18 PM
జాతీయ కోరికల దినోత్సవం సందర్భంగా బుధవారం బి.కొత్తకోట పట్టణం లోని సీడీపీఓ కార్యాలయం వద్ద బి.కొత్తకోట, పీటీయం, ములకల చెరువు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గానికి వర్తించే విధం గా నాలుగు లేబర్‌కోడ్లు పెట్టిందని, సంఘాలు పెట్టుకోకుండా, సమ్మెలు చేయకుండా కార్మికులను బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్‌కోడ్‌లు తెచ్చిందన్నారు. స్కీం వర్కర్లైన అంగనవాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మి కులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసవేతనం రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికసంఘం జిల్లా నాయకులు వీరప్ప, అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన అధ్యక్ష, కార్యదర్శులు కుమారి, శ్రీవాణి, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Latest News