డయేరియా తో ఆసుపత్రిపాలౌతున్న పిడుగురాళ్ల నగరవాసులు

by సూర్య | Thu, Jul 11, 2024, 05:17 PM

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా  కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేశ్ బాలాజీ, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని, అతిసారకు గల కారణాలను త్వరగా నిర్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే యరపతినేని సైతం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీన్ని త్వరితగతిన అదుపు చేయాలని, పరిస్థితిని 48గంటల్లో అదులులోకి తేవాలని గురజాల ఆర్డీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. అప్పటివరకు పిడుగురాళ్లలోనే ఉండాలని ఆర్డీవోకు సూచించారు.

Latest News

 
సోమ్మసిల్లి పడిపోయిన పారిశుధ్య కార్మికురాలు Thu, Oct 31, 2024, 01:03 PM
ఉచితంగా మట్టి ప్రమిదలను ఉచిత పంపిణీ Thu, Oct 31, 2024, 01:01 PM
కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి Thu, Oct 31, 2024, 12:58 PM
బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం Thu, Oct 31, 2024, 08:00 AM
షరతులతో పండితులకు నిరుద్యోగ భృతి Thu, Oct 31, 2024, 08:00 AM