by సూర్య | Thu, Jul 11, 2024, 05:17 PM
ఉచిత ఇసుక పంపిణీపై నీలిమిడియా దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ చేయలేని పనిని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేశారని కడుపుమంట పట్టుకుందని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భకాసురులుగా మారి ఇసుకను వైకాపాసురులు బొక్కారని ఎద్దేవా చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు కలుగుతుందని అన్నారు. నిర్మాణ రంగానికి ఊపిరి పోశారని ఉద్ఘాటించారు. వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అబద్దాలను నమ్ముకున్న వైసీపీ ఖచ్చితంగా ఒక గత చరిత్రగా మిగిలిపోతుందని విమర్శలు చేశారు. వైసీపీ భవిష్యత్ లేని పార్టీ.. ఆపార్టీ కార్యక్రమాలు ఇక ఉండవని చెప్పారు. వైసీపీ నేతలు ఇకనైనా నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై విషం చిమ్మటం మానుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుదిటి రాతను మార్చే శక్తి యుక్తి చంద్రబాబుకే ఉందని కాల్వ శ్రీనివాసులు ఉద్ఘాటించారు.
Latest News