by సూర్య | Thu, Jul 11, 2024, 05:16 PM
టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిల పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు, జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే.
Latest News